Sunday, April 28, 2024

వరల్డ్ నెంబర్ 2 నీరజ్ చోప్రా..

గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా వ‌ర‌ల్డ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరాడు. ఒలింపిక్స్ లో అద్బుత ప్రదర్శన చేసిన నీరజ్ చోప్రా ఏకంగా 14 స్థానాలు ఎగబాకి ప్రపంచం రెండో ర్యాంక్ కి చేరుకున్నాడు. . ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు అత‌డు 16వ స్థానంలో ఉన్నాడు. అయితే ఈ మెగా ఈవెంట్‌లో గోల్డ్ మెడ‌ల్ సాధించ‌డం నీర‌జ్ కెరీర్‌నే మార్చేసింది. ఫైన‌ల్లో 87.58 మీట‌ర్ల దూరం జావెలిన్ విసిరి ప్ర‌త్య‌ర్థుల‌కు అంద‌నంత దూరంలో నిలిచాడు. ప్ర‌స్తుత ర్యాంకింగ్స్‌లో నీర‌జ్ 1315 పాయింట్ల‌తో జ‌ర్మ‌నీ స్టార్ జావెలిన్ త్రోయ‌ర్ జోహ‌నెస్ వెట‌ర్ త‌ర్వాతి స్థానంలో ఉన్నాడు. వెట‌ర్ 1396 పాయింట్ల‌తో ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ఏడుసార్లు 90 మీట‌ర్ల కంటే ఎక్కువ దూరం విసిరిన వెట‌ర్‌.. ఒలింపిక్స్ ఫైన‌ల్లో మాత్రం దారుణంగా విఫ‌ల‌మ‌య్యాడు.

ఇది కూడా చదవండి: హుజురాబాద్ లో హరీష్ మకాం.. మహిళలతో ముఖాముఖి

Advertisement

తాజా వార్తలు

Advertisement