Sunday, April 28, 2024

టీమిండియాకు విషెష్ చెప్పిన నీర‌జ్ చోప్రా.. బెస్ట్‌గా నిల‌వాల‌ని ఆకాంక్ష‌లు!

రీసెంట్ గా జ‌రిగిన అథ్లెటిక్ వ‌ర‌ల్డ్‌ ఛాంపియన్ పోటీల్లో స్వ‌ర్ణం సాధించిన‌ నీరజ్ చోప్రా ఇవ్వాల (శుక్రవారం) స్విట్జర్లాండ్‌లో జ‌రిగిన మ‌రో పోటీలో శ‌భాష్ అనిపించుకున్నాడు. జ్యూరిచ్ డైమండ్ లీగ్ 2023లో పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో రెండో స్థానంలో నిలిచాడు. చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వడ్లెజ్ 85.86 మీటర్లతో మొదటి స్థానంలో నిలవ‌గా.. 85.71 మీ నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. కాగా, క్రికెట్ అభిమానుటు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ భారత్ vs పాకిస్థాన్ పోరుకు ముందు, రోహిత్ శర్మ అండ్ టీమ్ కి ప్రత్యేక సందేశాన్ని అందించాడు నీరజ్ చోప్రా.

జ్యూరిచ్ డైమండ్ లీగ్ సందర్భంగా నీరజ్ మాట్లాడుతూ, “నేను మా భారత జట్టుకు ఆల్ ది బెస్ట్ చెప్పాలనుకుంటున్నాను. అని అన్నాడు. అలాగే, “దేశం గ‌ర్వించేలా గ‌ట్టి పోటీ ఇవ్వండి, గెలిచేందుకు మీ వంద శాతం ఎఫ‌ర్ట్స్ ని పెట్టండి” అని సూచించాడు. ఇక‌, ఆసియా కప్ లోని తొలి రెండు మ్యాచ్‌లకు భారత వికెట్ కీపర్-బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరమ‌వ్వ‌నుండ‌గా.. అత‌ని ప్లేస్ లో ఇషాన్ కిషన్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. కాగా, భార‌త్ టాప్ ఆర్డ‌ర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శుభ్‌మాన్ గిల్.. పాకిస్థాన్‌కు చెందిన టాప్ బౌల‌ర్స్ షాహీన్ అఫ్రిది, హారిస్ రవూఫ్, భీకర నసీమ్ షాపై హెడ్ టూ హెడ ఫైట్ కు సిద్ధంగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement