Sunday, April 28, 2024

National – టెర్ర‌రిస్టుల‌కు రూల్స్ లేవు… మ‌రి మ‌న‌కెందుకు ఉండాలి – జైశంకర్‌

రిప్ల‌య్ కూడా మ‌న అట్ల‌నే ఇవ్వాలి
ఉగ్ర‌వాదాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆమోదించం
పాకిస్థాన్ మాత్రం సొంతానికి వాడుకుంటోంది
2014 నుంచి భార‌త విదేశీ విధానంలో మార్పు వ‌చ్చింది
26/11 దాడుల‌కు ప్ర‌తికారం తీర్చుకోకుంటే ఎలా?
మ‌న‌ల్ని ట‌చ్ చేయాలంటే ఎవ‌రైనా భ‌య‌ప‌డాలి
కేంద్ర విదేశీ వ్య‌వ‌హారాల‌ మంత్రి జైశంకర్‌

పదేళ్లలో దేశ విదేశాంగ విధానంలో గణనీయమైన మార్పు వచ్చిందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఈ మార్పే సరైన విధానమని చెప్పారు. ముష్కరులకు ఎలాంటి నియమాలు ఉండనప్పుడు.. దాడులకు ప్రతిస్పందన కూడా అలాగే ఉంటుందని స్ప‌ష్టం చేశారు. మహారాష్ట్రలోని పుణెలో శ‌నివారం జరిగిన ఓ కార్యక్రమంలో జైశంకర్‌ పాల్గొన్నారు. ఉగ్రవాద ముప్పు, దేశ దౌత్య సంబంధాల వంటి అంశాలపై యువత అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. ఏయే దేశాలతో సంబంధాలు కొనసాగించడం కష్టంగా ఉందని అడగ్గా.. పొరుగున ఉన్న పాకిస్థాన్‌ అని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించేది లేదని దాయాదిని ఉద్దేశిస్తూ మరోసారి తేల్చి చెప్పారు.

2014 నుంచి విదేశీ విధానంలో మార్పు వ‌చ్చింది..

పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని తమ ప్రయోజనాలకు ఉపయోగిస్తోందని మనం మొదట్నుంచీ స్పష్టంగా ఉంటే అప్పుడు భారత విదేశాంగ విధానం భిన్నంగా ఉండేద‌ని జైశంక‌ర్ అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే, 2014 నుంచి మన విదేశీ విధానంలో 50 శాతం మార్పు వచ్చింద‌ని, అది కూడా ఉగ్రవాదంపై మనం స్పందించే తీరులోనే అన్నారు. ముంబయి దాడుల తర్వాత ఉగ్రవాదంపై భారత్‌ స్పందించాలని అందరూ అనుకున్నారని, ఆ సమయంలో పాకిస్థాన్‌పై దాడి చేయడం కంటే.. చేయకపోవడమే వల్లే ఎక్కువ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింన్నారు.

అప్పుడు ప్ర‌తీకారం తీర్చుకోకుంటే..

- Advertisement -

ఒకవేళ, 26/11 ముంబయి పేలుళ్ల వంటి ఘటన ఇప్పుడు జరిగితే దానికి మనం ప్రతీకారం తీర్చుకోకపోతే.. తర్వాతి దాడులను మనం ఎలా నిరోధించగలం అని ప్ర‌శ్నించారు. ‘సరిహద్దులకు ఆవల ఉన్నాం కదా.. మనల్ని ఎవరూ టచ్‌ చేస్తారని ముష్కరులు అనుకుంటున్నారు. అది నిజం కాదని మనం రుజువు చేయాలి. ఉగ్రవాదులు ఎలాంటి రూల్స్‌ పెట్టుకుని దాడులు చేయరు.. అలాంటప్పుడు వారి చర్యలకు ప్రతిచర్యలు కూడా ఎలాంటి నియమాలకు లోబడి ఉండాల్సిన అవసరం లేదు” అని కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement