Monday, April 29, 2024

ద‌క్షిణ‌ సిక్కింలో భూకంపం

ఇవాళ తెల్ల‌వారుజామున దక్షిణ సిక్కింలో స్వల్ప భూకంపం సంభవించింది. సరిగ్గా 3.01 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ ఒక ప్రకటనలో వెల్లడించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైందని తెలిపింది. సిక్కింలోని రావన్‌గ్లా ప్రాంతానికి 12 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్నిగుర్తించినట్టు ఓ అధికారి ఒకరు తెలిపారు. రావన్‌గ్లాలోని భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతున భూప్రకంపనలు వచ్చినట్టు తెలిపారు. రాత్రి సమయంలో భూప్రకంపనలు రావడంతో ఇళ్లలోని ప్రజలంతా భయంతో బయటకు పరుగులు తీశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement