Wednesday, May 1, 2024

పాపులర్ ఇండియ‌న్‌ సెలబ్రిటీస్ లిస్ట్ లో నేషనల్ క్రష్ రష్మిక.. IMDB జాబితాలో థ‌ర్డ్ ప్లేస్‌

కెరీర్ బిగినింగ్ లోనే తన నటన, అభినయంతో నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది పాన్ ఇండియన్ హీరోయిన్ రష్మిక మందన్న. తన సక్సెస్ ఇప్పుడు దేశమంతటా విస్తరిస్తోంది. కాగా, IMDB (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ ఫీచర్ లిస్ట్ లో ఇప్పుడు రష్మిక పేరు కూడా చేరింది. ఈ జాబితాలో రష్మిక మూడో స్థానంలో నిలిచింది.

అయితే, ఈ నెల రష్మిక కి చాలా స్పెషల్ అనే చెప్పాలి.. ఈ నెలలోనే ఆమె పుట్టినరోజు జరుపుకోగా, రష్మిక నటిస్తోన్న “పుష్ప 2” ట్రైలర్‌ కూడా రిలీజ్ అయింది. కాగా, ప్రస్తుతం ఈ నటి తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో ప‌లు ప్రాజెక్ట్‌లు చేస్తోంది. అందులో తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న రెయిన్‌బో ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. త్వరలో, ఆమె వెంకీ కుడుముల, నితిన్‌ తో ఓ ప్రాజెక్ట్ చేయనుంది. ఆమె ఇతర బాలీవుడ్ మూవీ అయిన రణబీర్ కపూర్ “యానిమల్” కూడా హీరోయిన్ గా కనపించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement