Monday, April 29, 2024

KKR vs RR | నరైన్ సెంచ‌రీ.. రాజస్థాన్ ముందు భారీ టార్గెట్

ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ – రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో… తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు భారీ స్కోర్ సాధించింది. బౌండ‌రీతో చెల‌రేగిన కోల్‌కతా ఓపెనర్ సునీల్ న‌రైన్ శతకొట్టాడు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది.

ఓపెనర్ సునీల్ నరైన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 49 బంతుల్లో (11 ఫోర్లు, 6 సిక్సులు) 100 సెంచరీ చేశాడు. ఐపీఎల్లో అతనికి ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ 10 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. రఘువంశీ 30 పరుగులు చేయగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 7 బంతుల్లో 11 రన్స్ చహళ్ బౌలింగ్ ఎల్బిడబ్ల్యూ అయ్యాడు. రస్సెల్ 10 బంతుల్లో 13 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. చివర్లో రింక్ సింగ్ 9 బంతుల్లో 20 పరుగులు చేయడంతో కోల్కతా భారీ స్కోరు నమోదు చేయగలిగింది.రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో అవేశ్ ఖాన్, కుల్దీప్ సేన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement