Sunday, April 28, 2024

ఫ‌న్ ఎంట‌ర్టైన‌ర్ మూవీలో శ్రీవిష్ణు-గెస్ట్ గా నారా రోహిత్

కెరీర్ మొద‌టి నుండి హీరో శ్రీవిష్ణు విభిన్న జాన‌ర్ లో మూవీస్ చేస్తున్నాడు.. ఇటీవలే ఈయన నటించిన అల్లూరి విడుదలై పాజిటీవ్‌ టాక్‌ తెచ్చుకుంది. నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీవిష్ణు పోలీస్‌ అధికారిగా నటించాడు. ఇదిలా ఉంటే తాజాగా శ్రీవిష్ణు తన తదుపరి సినిమాను ప్రకటించాడు. శ్రీ విష్ణు ప్రస్తుతం ఏ.కే ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌లో ఓ ఫన్‌ ఎంటర్టైనర్‌ సినిమా చేస్తున్నాడు. ‘వివాహా భోజనంబు’ వంటి వినోధాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన రామ్‌ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమాలను హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలో ప్రారంభించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ ముహూర్తపు వేడుకకు హీరో నారా రోహిత్ గెస్ట్‌గా హజరై కెమెరా స్విచ్ఛాన్‌ చేశాడు. గోపీ సుందర్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement