Saturday, April 27, 2024

నహక్‌ ఈవీ మోపెడ్‌.. 5 గంటల్లో ఫుల్‌ చార్జింగ్‌.

నహక్‌ మోటార్స్ త‌న సరికొత్త ఎలక్ట్రిక్‌ మోపెడ్‌ను దేశవ్యాప్తంగా లాంచ్‌ చేసింది. ఫరీదాబాద్‌ నగరం కేంద్రంగా నహక్‌ సేవలు అందిస్తున్నది. ఎగ్జిటో సోలో ఎలక్ట్రిక్‌ మోపెడ్‌ ధర రూ.85,999 (ఎక్స్‌షోరూం)గా నిర్ణయించింది. ఈ మోపెడ్‌ మీద ప్రయాణించాలంటే.. కిలోమీటర్కు కేవలం 25 పైసలే ఖర్చు అవుతుంది.

వచ్చే నెల నుంచి ఫ్రీ బుకింగ్స్‌ ప్రారంభం కానున్నాయి. 100 శాతం మేడ్‌ ఇన్‌ ఇండియా ఎలక్ట్రిక్‌ మోపెడ్‌ అని నహక్‌ మోటార్స్‌ ప్రకటించింది. 150 కిలోల వరకు పేలోడ్‌ సామర్థ్యం ఉంది. 48వీ 30 ఏహెచ్‌ బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి ఛార్జింగ్‌ 5 గంటల సమయం పడితే.. 80 కి.మీ వరకు వెళ్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement