Friday, April 26, 2024

ఫ్రెంచ్‌ ఓపెన్‌కు నాదల్‌ దూరం..

దీర్ఘకాలిక తుంటిగాయం కారణంగా ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి వైదొలగుతున్నట్లు రాఫెల్‌ నాదల్‌ గురువారం ప్రకటించారు. 2024 తన కెరీర్‌లో చివరి సీజన్‌ అవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు. క్లే కోర్టు గ్రాండ్‌ స్లామ్‌ టోర్నమెంట్‌లో రికార్డు స్థాయిలో 14 చాంపియన్‌షిప్‌లు సాధించిన నాదల్‌, 2005లో అరంగేట్రం చేసిన తర్వాత మొదటిసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌కు దూరమవుతున్నాడు. వచ్చేనెలలో నాదల్‌కు 37 ఏళ్లు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో కెరీర్‌కు ముగింపు పలికే విషయంపైనా, భవిష్యత్‌ ప్రణాళికలపైనా అతడు స్పష్టత ఇచ్చాడు. కాగా, మే 28న ప్యారిస్‌లోని గారోస్‌లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నీ ప్రారంభం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement