Monday, May 6, 2024

రామారావు ఆన్ డ్యూటీ నుండి ఐటెం సాంగ్ రిలీజ్

రామారావు ఆన్ డ్యూటీ నుండి ఐటెం సాంగ్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ చిత్రంతో శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. ఈ చిత్రంలో ర‌వితేజ డిప్యూటీ క‌లెక్ట‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు. ఈ మూవీలో మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ హీరోగా న‌టిస్తున్నాడు. ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 29న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో చిత్ర‌బృందం వ‌రుస అప్‌డేట్‌ల‌ను ఇస్తుంది. తాజాగా ఈ చిత్రంలోని మాస్ సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. నా పేరు సీసా అంటూ సాగే ఈ స్పెష‌ల్ సాంగ్‌ను శ్రేయఘోష‌ల్ ఆల‌పించింది. చంద్ర‌బోస్ సాహిత్యాన్ని అందించాడు. లేటెస్ట్‌గా విడులైన ఈ పాట శ్రోత‌ల‌ను ఆక‌ట్టుకుంటుంది. సామ్ సీ.ఎస్ స్వ‌ర ప‌రిచిన ఈ పాట కొత్తగా, క్యాచీగా ఉంది. బాలీవుడ్ బ్యూటీ అన్వేషి జైన్ ఈ ఐటెం సాంగ్‌లో న‌ర్తించింది. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన ‘బుల్ బుల్ తరంగ్‌’, ‘సొట్ట బుగ్గ‌ల’ సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుండి విశేష స్పంద‌న వ‌చ్చింది. ర‌వితేజ‌కు జోడీగా ఈ చిత్రంలో దివ్యాంక కౌశిక్, రాజిషా విజ‌య‌న్ హీరోయిన్లుగా న‌టించారు. చాలా కాలం త‌ర్వాత సీనియ‌ర్ న‌టుడు వేణు తోట్టెంపూడి ఈ చిత్రంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. శ్రీ ల‌క్ష్మివెంక‌టేశ్వ‌రా సినిమాస్, ఆర్‌టి టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ల‌పై సుధాక‌ర్ చెరుకూరితో కలిసి ర‌వితేజ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement