Sunday, May 26, 2024

ఇళ‌య‌రాజాతో సెల్ఫీ వీడియో తీసుకున్న ఏఆర్ రెహ‌మాన్..మా గ‌మ్య‌స్థానం త‌మిళ‌నాడు

వారిద్ద‌రూ ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కులు.ఒకే ఎయిర్ పోర్టులో క‌లిశారు. వారే ఏఆర్ రెహ‌మాన్..ఇళ‌య‌రాజా.కాగా వారి క‌ల‌యిక‌ని రెహమాన్ ప్రాంతీయత కోణంలో చెప్పే ప్రయత్నం చేశారు. మేం భిన్న దేశాల నుంచి తిరిగొస్తున్నాం. కానీ, మా గమ్యస్థానం ఎప్పుడూ తమిళనాడే అని రెహమాన్ పేర్కొన్నారు. ఇళయరాజాతో సెల్ఫీ వీడియో తీసుకున్న రెహమాన్ దానిని తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇళయరాజా బుడాపెస్ట్ నుంచి తిరిగి రాగా, రెహమాన్ అమెరికా నుంచి తిరిగొచ్చారు. దీంతో చెన్నై ఎయిర్ పోర్ట్ లో ఎదురెదురుగా తారసపడ్డారు. ఏఆర్ రెహమాన్ ప్రస్తుతం మణిరత్నం రూపొందిస్తున్న పొన్నియిన్ సెల్వన్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మణిరత్నంతో రెహమాన్ కు ఇది 15వ ప్రాజెక్టు కానుంది. అభిమానులు దీనికి హార్ట్ ఎమోజీలతో స్పందన తెలియజేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement