Sunday, May 5, 2024

మౌత్ వాష్ ఆర్డర్ చేస్తే.. రెడ్మీ ఫోన్ డెలివరీ!

కరోనా అందరి జీవితాలను మార్చడమే కాకుండా అందరి జీవన విధానాలను మార్చివేసింది. ఒకప్పుడు ప్రతి వస్తువు కోసం దుకాణానికి వెళ్లే వారు. కానీ, ఇప్పుడు కూర్చున్న చోటి నుండే ఫోన్ ద్వారా అన్నింటిని ఆన్లైన్‌లో బుక్ చేస్తున్నారు. ఈ-కామర్స్ దాదాపు అన్నిరకాల షాపింగ్స్‌ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో అధిక శాతం మంది వినియోగదారులు ఆన్‌ లైన్‌ లోనే షాపింగ్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే కొన్ని సార్లు జ‌రిగే పొర‌పాట్ల వ‌ల్ల మ‌నం ఆర్డ‌ర్ చేసే వ‌స్తువులు కాకుండా వేరే వ‌స్తువులు డెలివ‌రీ అవుతుంటాయి. అమెజాన్‌లో మౌత్ వాష్ ఆర్డ‌ర్ చేస్తే రెడ్‌మీ ఫోన్ వ‌చ్చింది.

వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన లోకేష్ దాగా అనే వ్య‌క్తి అమెజాన్‌లో 4 కోల్గేట్ మౌత్ వాష్‌ల‌ను ఆర్డ‌ర్ చేశాడు. అయితే అత‌నికి మౌత్ వాష్‌ ల‌కు బ‌దులుగా రెడ్‌ మీ నోట్ 10 స్మార్ట్ ఫోన్ డెలివరీ అయ్యింది. తాను మౌత్ వాష్‌ ల‌ను ఆర్డ‌ర్ చేస్తే ఫోన్ వ‌చ్చిందేమిట‌బ్బా అని కంగారు ప‌డ్డాడు. వెంటనే తేరుకుని ఇన్‌ వాయిస్ చూడ‌గా వేరే వాళ్ల‌కు వెళ్లాల్సిన ఇన్‌ వాయిస్ ఉంది. కానీ అడ్ర‌స్ మాత్రం అత‌నిదే ఉంది. అయితే ఈ విష‌యాన్ని అత‌ను ట్విట్ట‌ర్ ద్వారా అమెజాన్‌కు తెలిపాడు. తాను మౌత్ వాష్‌ల‌ను ఆర్డ‌ర్ చేస్తే రెడ్‌మీ నోట్ 10 ఫోన్ వ‌చ్చింద‌ని, మౌత్ వాష్‌లు క‌న్‌జ్యూమ‌బుల్స్ క‌నుక వాటిని రిట‌ర్న్ పంపేందుకు ఆప్ష‌న్ లేద‌ని, క‌నుక అమెజాన్ స్పందించి ఆ ఫోన్ ఎవ‌రికైతే చేరాలో వాళ్ల‌కి దాన్ని చేర్చాల‌ని చెప్పాడు. కాగా, లోకేష్‌ ట్వీట్ పై పన్నీ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

Advertisement

తాజా వార్తలు

Advertisement