Saturday, March 23, 2024

తార‌క్ తో డ్యాన్స్ కు రెడీ అవుతున్న సీతామ‌హాల‌క్ష్మీ

జూనియర్ ఎన్టీఆర్ కు సీతారామం బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ ఫిక్స్ అయ్యిందని కొత్తగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి . ప్రస్తుతం ఎన్టీఆర్ – కొరటాల శివ కలయికలో ఒక సినిమా రాబోతుంది. ఈ సినిమాలో ఓ ట్రెడిషనల్ సాంగ్ ఉంది. ఈ సాంగ్ లోనే సీతారామం ఫేమ్ మృణాల్‌ ఠాకూర్‌ నటించబోతుందని టాక్ నడుస్తోంది. ఇప్పటికే కొరటాల కూడా సీతారామం హీరోయిన్ తో ఈ సాంగ్ పై చర్చించారట. నిజానికి మృణాల్‌ ఠాకూర్‌ కి భరత నాట్యం వచ్చు. ఇక ఎన్టీఆర్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. మరి, ఎన్టీఆర్ – మృణాల్‌ ఠాకూర్‌ కలయికలో ట్రెడిషనల్ సాంగ్ అంటే.. భారీ అంచనాలు ఉంటాయి. ఒకే ఫ్రేమ్ లో ఎన్టీఆర్ కి పోటీగా మృణాల్‌ ఠాకూర్‌ డ్యాన్స్ చేస్తే స్క్రీన్స్ షేక్ అయిపోతాయి. పైగా సీతారామం తర్వాత మృణాల్‌ ఠాకూర్‌ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. మృణాల్‌ ఠాకూర్‌ కి బాలీవుడ్ లో భారీ ఆఫర్స్ వస్తున్నాయి. అందుకే, మృణాల్‌ ఠాకూర్‌, ఎన్టీఆర్ తో కలిసి డ్యాన్స్ చేస్తే చూడటానికి ప్రేక్షకులు కూడా డబుల్ ఆసక్తి చూపిస్తారు. ఈ అప్ డేట్ పై త్వరలోనే క్లారిటీ రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement