Saturday, May 4, 2024

మిస్ట‌ర్ కింగ్ వ‌స్తున్నాడు…

దివంగత నటి, దర్శకురాలు విజయనిర్మల మనవడు శరణ్‌ కుమార్‌ (నటుడు నరేశ్‌ కజిన్‌ కుమారుడు) హీరోగా, శశిధర్‌ చావలి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్‌ కింగ్‌’. బి.ఎన్‌.రావు నిర్మించారు. యశ్విక నిష్కల, ఊర్వీ సింగ్‌ కథానా యికలు . మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం లో పాటలు ఇప్పటికే సూపర్‌ హిట్‌ అయ్యాయి. అలాగే టీ-జర్‌ కు మంచి స్పందన వచ్చింది. ఈ నెల 24న ‘మిస్టర్‌ కింగ్‌ ‘ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ మీడి యా నిర్వహించింది.


శరణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం యూనిట్‌ అం తా చాలా హార్డ్‌ వర్క్‌ చేశాం. నిర్మాత బిఎన్‌ రా వు గారు ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. ‘ అన్నారు. దర్శకుడు శశిధర్‌ మాట్లా డుతూ.. ఆత్మ గౌరవం వున్న ప్రతి అబ్బాయి చూడాల్సిన సినిమా ఇది. ఆడ పిల్ల వున్న ప్రతి కుటు-ంబం చూడాల్సిన సినిమా. అన్నారు.
యశ్విక నిష్కల, ఊర్వీ సింగ్‌ మాట్లాడుతూ.. మంచి టీ-ంతో కలసి పనిచేయడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఈ సిని మా మీ అందరికీ నచ్చుతుం దని ఆశి స్తున్నాము అన్నారు.
బిన్‌ రావు మాట్లాడుతూ.. ఈ నెల 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది అందరూ థియేటర్‌లో చూడాలని కోరు కుంటు-న్నాను.

Advertisement

తాజా వార్తలు

Advertisement