Monday, May 6, 2024

పోర్టుల అభివృద్ధికి మరిన్ని రుణాలు

పోర్టుల వార్షిక సరుకు నిర్వహణ సామర్థ్యం మరో 83.6 కోట్ల టన్నులు పెరిగేందుకు దోహదపడేలా దాదాపు 20 నౌకాశ్రయాలకు రూ.8,244 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు ఐఐఎఫ్‌సీఎల్‌ వెల్లడించింది. ఐఐఎఫ్‌సీఎల్‌ ఆర్థిక మద్దతునిస్తున్న వ్యూహాత్మక నౌకాశ్రయాల జాబితాలో పారాదీప్‌ పోర్ట్‌, ఎస్సార్‌ వైజాగ్‌ పోర్ట్‌, తూత్తుకుడి, కృష్ణపట్నం, కరైకల్‌ పోర్టులు ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని రామాయపట్నం పోర్టు అభివృద్ధికి సైతం రుణం సమకూరుస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

రామాయపట్నం, భావనపాడు సహా త్వరలో ప్రారంభం కానున్న మూడు పోర్టులతో అదనపు కార్గో నిర్వహణ సామర్థ్యం 100 కోట్ల టన్నులకు పెరగనుందని ఐఐఎఫ్‌సీఎల్‌ పేర్కొంది. నాలుగు బెర్తులు, 3.4 కోట్ల టన్నుల సరుకు నిర్వహణ సామర్థ్యంతో కూడిన రామాయపట్నం పోర్టు కార్యకలాపాలు 2023 డిసెంబరు నాటికి ప్రారంభం కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement