Monday, May 20, 2024

TS | రేపు తెలంగాణకు రానున్న మోదీ – షెడ్యూల్ ఇదే !

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ టూర్ ఆసక్తి రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి రాష్ట్ర పర్యటనకు వస్తున్న మోదీ రాజకీయంగా ఎలాంటి ప్రసంగం చేయబోతున్నారనేది ఉత్కంఠగా మారింది. రేపు (సోమవారం) ఉదయం 9.20 గంటలకు ప్రత్యేక విమానంలో నాగ్‌పూర్ చేరుకుంటారు నరేంద్ర మోదీ. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ల ద్వారా ఉదయం 10.20 గంటలకు ఆదిలాబాద్ కు చేరుకొని.. 30 నిమిషాల పాటు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పార్టీ పరంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఆదిలాబాద్ పర్యటన తర్వాత తమిళనాడుకు వెళ్లనున్నారు నరేంద్రమోదీ. చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొని.. రాత్రి 7.45 ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుంటారు. సోమ‌వారం రాత్రి 8గంటల హైదరాబాద్ చేరుకొని రాజ్ భవన్ లో బసచేస్తారు మోదీ. మంగళవారం ఉదయం సంగారెడ్డిలో పర్యటిస్తారు ప్రధాని. సంగారెడ్డిలో 9వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. మొదట బేగంపేట ఎయిర్ పోర్టులో 400 కోట్లతో నిర్మించిన పౌరవిమానయాన పరిశోధనా సంస్థను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు ప్రధాని.

ప‌లు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు..

రామగుండం NTPCలో 6వేల కోట్లతో నిర్మించిన రెండో థర్మల్ పవర్ యూనిట్ ను జాతికి అంకితం చేస్తారు. 70 కోట్లతో నిర్మించిన అంబారి – ఆదిలాబాద్ – పింపాలకుట్టి రైల్వే లైన్ విద్యుదీకరణను ప్రారంభిస్తారు. వీటితో పాటు 491 కోట్లతో ఆదిలాబాద్- బేలా మధ్య NH-353Bపై చేపట్టనున్న 2 లైన్స్ నేషనల్ హైవే విస్తరణకు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా 136 కోట్లుతో చేపట్టనున్న NH-163 పై హైదరాబాద్ – భూపాలపట్నం రోడ్డుకుభూమిపూజ చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement