Saturday, July 27, 2024

Rains | హైదరాబాద్‌లో పలుచోట్ల ఓ మోస్తరు వర్షం…

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. కాగా, రాష్ట్రంలో రానున్న 4-5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది.

హైదరాబాద్‌తో పాటు జనగాం, కామారెడ్డి, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వరంగల్, భువనగిరిలో ఓ మోస్తరు వర్షం కురుస్తుంది. దీంతో వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement