Monday, July 22, 2024

Heritage Foods Stock | 6 రోజుల్లో రూ.1100 కోట్లు..

నారా చంద్రబాబు కుటుంబం ప్రమోట్ చేస్తున్న హెరిటేజ్ ఫుడ్స్… కేవలం 6 ట్రేడింగ్ సెషన్స్ లోనే 70శాతం పైగా పెరిగి రిటైల్ ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఎన్నిక‌ల రిజల్ట్స్ ప్రకటన తర్వాత ఈ స్టాక్ ను పట్టుకునేందుకు ఇన్వెస్టర్లు ఎంతగానో ప్రయత్నించారు. దీంతో ఈ స్టాక్ అప్పటి నుంచి పైపైకి చూస్తోంది.

మే 31న 404 రూపాయలుగా ఉన్న ఈ స్టాక్.. సోమవారం ట్రేడింగ్ ముగిసేసరికి 695 రూపాయలకు పెరిగింది. ట్రేడింగ్ ప్రారంభమైన 20 నిమిషంలోనే ఈ స్టాక్ 727కు పెరిగింది. ఆ తర్వాత ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు దిగడంతో ఈ స్టాక్ చివరకు 5శాతం పైగా లాభంతో 695 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ విషయానికి వస్తే 6వేల 450 కోట్లకు పెరిగింది. మరోవైపు ఈ కంపెనీలో వాటా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు, తొమ్మిదేళ్ల మనవడు దేవాన్ష్ సంపద కేవలం 6 రోజుల్లో కోటి70 లక్షల రూపాయలు పెరిగింది.

ఈ కంపెనీలో దేవాన్ష్ కు 0.06 శాతం వాటా. 1992లో ప్రారంభమైన హెరిటేజ్ ఫుడ్స్ లో చంద్రబాబు కుటుంబానికి మొత్తం 35.7 శాతం వాటా ఉంది. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి ఈ కంపెనీలో 24.37శాతం వాటా, నారా లోకేశ్ కు 10.82శాతం వాటా, నారా బ్రాహ్మణికి 0.46శాతం వాటా ఉంది. గత 6 రోజుల్లో చంద్రబాబు కుటుంబానికి మొత్తం చూసుకుంటే 1100 కోట్లకు పైగా సంపద పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement