Tuesday, May 21, 2024

ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే.. అమరావతిలో హై టెన్షన్..!

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య బహిరంగ చర్చకు సంబంధించి జరుగుతున్న వివాదం ప్రస్తుతం పోలీసులకు ఆందోళన కలిగిస్తుంది. దీంతో అమరావతిలో హై టెన్షన్ కొనసాగుతుంది. ఎలాంటి అవాంచ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా పోలీసులు అమరావతి ప్రాంతంలో భారీగా పోలీస్ పహారా ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే అమరావతి చేరుకున్నారని స్పష్టమైన సమాచారం అందుతుంది. ప్రమాణం చేయడానికి పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్రావు మరియు మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ మాటల సవాళ్లు విసురుకున్నారు. ఈ ప్రమాణానానికి అటు వైసీపీ ఇటు టీడీపీల నుండి కార్యకర్తలు భారీగా తరలివస్తుండడం గమనించిన అమరావతి పోలీసులు గొడవలు జరుగుతాయని ముందే ఊహించి ఈ రాత్రి 9 గంటల వరకు 144 సెక్షన్ ను అమలులో పెట్టారు. ఈ తరుణంలోనే.. ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు లాఠిచార్జి చేశారు.

కార్యకర్తలు సమన్వయం పాటించండి : ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
అమరావతి అమరలింగేశ్వర స్వామి సాక్షిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ హయాంలో జరిగిన అవినీతిని, తన హయాంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు తానొక్కడినే వెళ్తానని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు చెప్పారు. నాలుగేళ్ల పాలనలో తాను కానీ, నాయకులు కానీ ఒక్క పైసా కూడా అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. టీడీపీ పాలనకు మన పాలనకు తేడా ఆధారాలతో సహా చూపించి చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. కార్యకర్తలే తన బలమని.. దయచేసి వాళ్లు.. ఆందోళన చెందకుండా పోలీసు వారికి సహకరించాలని కోరారు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు.

Advertisement

తాజా వార్తలు

Advertisement