Wednesday, May 1, 2024

వివాదాస్పద వ్యాఖ్యలపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఘటనలో​ పోలీసులు ఆయన్ను ఈ ఉదయం అరెస్ట్‌ చేశారు. డబీర్‌పురా పీఎస్‌లో నమోదైన కేసులో భాగంగా పోలీసులు.. రాజాసింగ్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ ఉదయం రాజాసింగ్‌ ఇంటికి చేరుకున్న పోలీసులు.. ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేసి పీఎస్‌కు తరలించారు. ఇప్పటికే రాజాసింగ్‌పై హైదరాబాద్‌లోని పలు పీఎస్‌లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే.


రాజాసింగ్ వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, ఎమ్మెల్యే విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఎంఐఎం నేతలు ధర్నాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు మంగళవారం ఉదయం రాజాసింగ్ నివాసానికి వెళ్లి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement