Friday, May 17, 2024

MI vs RR | టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజ‌స్థాన్..

ఐపీఎల్ 2024 లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్ – రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. హోం గ్రౌండ్ వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై తొలుత బ్యాటింగ్ చేయనుంది.

తుది జట్లు

రాజస్థాన్ రాయల్స్ :

జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (c & wk), రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, నాంద్రే బర్గర్.

ముంబై ఇండియన్స్ :

రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (WK), నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (c), టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ మధ్వల్, క్వేనా మఫాకా.

- Advertisement -

ముంబైకి తొలి గెలుపు ద‌క్కేనా…

ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచి అజేయ జట్టుగా కొనసాగుతుంది రాజస్థాన్ రాయల్స్. మరోవైపు ముంబై ఇండియన్స్‌ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. కాగా, రాజస్థాన్‌తో ముంబై ఇండియన్స్‌కు మొదటిది కావడంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. కొత్త కెప్టెన్‌ హార్దిక్‌ నేతృత్వంలో ముంబై తొలిసారి హోం గ్రౌండ్‌లో మ్యాచ్‌ ఆడుతుంది.

మరోవైపు రాజస్థాన్‌… ప్రత్యర్ధి గ్రౌండ్‌లో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. రాయల్స్‌ ఇప్పటివరకు ఆడి, గెలిచిన రెండు మ్యాచ్‌లు హోం గ్రౌండ్‌లోనే కావడంతో ఈ మ్యాచ్‌లో ఆ జట్టు ఏ మేరకు రాణిస్తుందోనన్నది ఆసక్తికరంగా మారింది. ముంబై వరుసగా గుజరాత్‌, సన్‌రైజర్స్‌ చేతిలో ఓటమిపాలు కాగా.. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ వ‌రుస‌గా లక్నో, ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయాలు సాధించి సూపర్‌ ఫామ్‌లో ఉంది. మరి వరుస విజయాలతో దూసుకుపోతున్న రాయల్స్‌ను ముంబై ఏ మేరకు నిలువరించగలుగుతుందో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement