Sunday, May 19, 2024

TS | దిగొచ్చిన మెట్రో.. ఆఫర్స్ ఇస్తున్నట్టు వెల్లడి

హైదరాబాద్ మెట్రో రైల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ‘హాలిడే కార్డ్’, ‘సూపర్ ఆఫ్ పీక్ అవర్’ ఆఫర్లను పూర్తిగా తొలగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో ఇటీవలే ప్రకటించింది. దీంతో ఆ కార్డుదారులు నిరాశకు గురయ్యారు. తాజాగా ఉగాది పండుగ సందర్భంగా ఈ కార్డు సేవలను మళ్లీ పొడిగించాలని నిర్ణయించినట్లు హైదరాబాద్ మెట్రో ప్రకటించింది.

ప్రజల నుంచి వచ్చిన స్పందన ఆధారంగా సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్, మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ ఆఫ్ పీక్ అవర్ ఆఫర్ ను మరో 6 నెలల పాటు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ప్రజలకు మేలు చేసే సేవలను అందించేందుకు మెట్రో ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపింది. ఎక్కువ మంది ప్రజలు మెట్రోలో ప్రయాణించేలా ప్రోత్సహించడమే ఈ పథకం లక్ష్యం అని మెట్రో రైల్ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement