Friday, May 3, 2024

Alert: సందేశం వస్తే… సందేహించండి

సైబర్‌ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ముఖ్యంగా వాట్సప్‌, మెయిల్‌, సెల్‌ఫోన్లకు వచ్చే మెసేజ్‌ల పట్ల ఆప్రమత్తంగా ఉండాలని సైబర్‌ నిపుణులు, పోలీసులు సూచిస్తున్నారు. సైబర్‌ నేరాల పట్ల ఒకవైపు ప్రజలను చైతన్యవంతం చేస్తున్నా..మరోవైపు సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుకొని చాలా మంది అమాయక ప్రజలు మోస పోతూనే ఉన్నారు.

గిఫ్ట్‌, రుణాలు, లాటరీ, టవర్స్‌, బంగారం, స్వల్ప వడ్డీలు, వ్యాపారం, విమాన టికెట్స్‌ తదితర ఆశలు కల్పిస్తూ యదేశ్ఛగా సైబర్‌ నేరగాళ్లు నెట్టింట వేదికగా దోపిడీకి పాల్పడుతున్నారు. ఇటీ-వల కాలంలో సైబర్‌ నేరాలు చాలా పెరిగాయని పోలీసుల నివేదికలు వెల్లడిస్తూనే ఉన్నాయి. ఇలాంటి నేరాలకు పాల్పడే వ్యక్తులను పట్టు-కొని, డబ్బులు రికవరీ చేయడం పోలీసులకు సైతం కష్టతరంగా మారింది. ఉద్యోగుల నుంచి మొదలుకొని, సామాన్యులే కాదు.. చివరకు ప్రజాప్రతినిధులు, పోలీస్‌ అధికారులు సైతం సైబర్‌ మోసా లకు గురైన బాధితుల జాబితాలో ఉన్నారు.

సాంకేతిక అభి వృద్ధి నేపథ్యంలో ప్రతిదీ డిజిటలైజేషన్‌గా మారడం, ఆన్‌లైన్‌ షాపింగ్‌, క్యాష్‌ ఆన్‌ డెలివరీ ఆప్షన్‌, ఆఫర్‌ కోసం క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా డబ్బులు చెల్లిస్తున్న క్రమంలో ఇది సైబర్‌ నేరగాళ్లు వరంగా మారింది. ఆన్‌లైన్‌లో ప్రముఖ కంపెనీలకు సంబంధించి నకిలీ వెబ్‌సైట్‌లు రూపొందిస్తూ కేటుగాళ్లు అందినకాడికి దండుకుంటున్నారు. అలాగే ప్రముఖ బ్యాం కులు, ప్రభుత్వ సంస్థల లోగోలతో నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి ఆన్‌లైన్‌లో ఉంచడంతో ఆయా లింక్‌ క్లిక్‌ చేసిన వారు తమ వ్యక్తిగత వివరాలు నమోదు చేయడంతో వారి బ్యాంక్‌ ఖాతాలో ఉన్న నగదు ఖాళీ అవుతోంది.
అనుసంధానంతో అనర్ధం…
ఇటీవల కాలంలో సెల్‌ఫోన్‌ నంబర్‌కు ఆధార్‌తో పాటు- బ్యాంకు ఖాతాలు, భూముల వివరాలు, ఉద్యోగ సమాచారం వంటివి అనుసంధానం చేయకతప్పడం లేదు. దీంతో నేరగాళ్లు ఫోన్‌ నెంబర్‌ను సేకరించి, దానికి ఉన్న యూపీఐ ఐడీని తెలుసుకోవడానికి అనేక రకాల లింక్‌లను సృష్టిస్తున్నారు. గూగుల్‌ పే, ఫోన్‌ పే ఇకపై వాడలేరు.. అంటూ మెసేజ్‌లు పంపుతారు. ఏదో అయిపోతుందనే కంగారులో సదరు లింకులను క్లిక్‌ చేసిన వెంటనే ఖాతా వివరాలు పూర్తిగా సైబర్‌ నేరగాళ్ల చేతిలోకి వెళ్తు న్నాయి. నేరగాళ్లు ప్రత్యేకంగా తయారు చేసుకున్న ప్రోగ్రా మింగ్‌ యాప్‌ నుంచి బ్యాంకు ఖాతా నిలిచిపోయి వారి బ్యాంకు ఖాతా నుంచి సునా యాసంగా నగదు కాజేస్తున్నారు. గూగుల్‌లో కస్టమర్‌ కేర్‌ నెంబర్‌ కోసం వెతికారంటే సైబర్‌ నేరగాళ్ల చేతిలో పడినట్లే. ఆధార్‌ ఎనబుల్‌ పేమెంట్‌ సిస్టమ్‌ ద్వారా కూడా మోసాలకు పాల్పడుతున్నారు. ఏటీ-ఎం సౌకర్యం లేని ప్రాంతాల్లో నగదును తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఏఈపీఎస్‌ పద్ధతిని ప్రవేశపెట్టింది. తద్వారా ఫింగర్‌ ప్రింట్‌ సాయంతో రోజుకు రూ.10వేల వరకు డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఇది కూడా సైబర్‌ నేరగాళ్లకు ఒక అవకాశంగా మారింది. దీంతో పలు రకాలుగా ప్రజల వేలిముద్రలను సేకరించి, ఏఈపీఎస్‌ ద్వారా డబ్బులు దోచేస్తున్నారు.
పోలీసుల అవగాహన…
దేశ వ్యాప్తంగా సైబర్‌ నేరాలు పెరుగుతుండడం రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో కళాజాత ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. గతంలో మూఢనమ్మకాలపై కళాజాతలు నిర్వహించే పోలీసులు ఇటీవల కాలంలో – సైబర్‌ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. కాగా సైబర్‌ నేరస్థుల చేతిలో నిరక్షరాస్యుల కన్నా అక్షరాస్యులే ఎక్కువగా మోసం పోతున్నారని, స్వల్ప పెట్టుబడులతో అధిక లాభాలు గడించవచ్చన్న ఆశతో అత్యధికులు సైబర్‌ చీటర్ల ఉచ్చులో పడుతున్నారని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొం టున్నారు. ఎలాంటి మోసం జరిగినా తొందరగా స్పందించి, దగ్గరలోని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి.బ్యాంక్‌ మేనేజర్‌ అంటూ, ప్రభుత్వ అధికారినంటూ వచ్చిన కాల్స్‌ను నమ్మొద్దని అనుమానం వచ్చిన వెంటనే సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన సూచిసు ్తన్నారు. సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోతే, 24 గంటల్లోపు జాతీయ హెల్ప్‌లైన్‌ 155260తో పాటు- కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు నిర్వహిస్తున్న వెబ్‌ పోర్టల్‌కు ఫిర్యాదు చేయాలని వివరి స్తున్నారు. దీంతో సైబర్‌ -కై-ం ఖాతాల్లోకి బదిలీ కాకుండా చర్య లు తీసుకునే అవకాశం ఉంటు-ంది. సైబర్‌ నేరగాళ్ల ఖాతాలో డబ్బు ఉన్నప్పుడు బ్యాంకు అధికారులను అప్రమత్తం చేసి, వాటిని ఫ్రీజ్‌ చేస్తారు. ఇది 24 గంటల్లోపు ఫిర్యాదు చేస్తే సాధ్యమవుతుందని పోలీసులు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement