Sunday, April 28, 2024

Bilkis Bano case: బిల్కిస్ బానో కు న్యాయం…11 మంది దోషులకు క్షమాభిక్ష రద్దు..

బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం వెలువరించింది. 11మంది దోషులకు క్షమాభిక్ష రద్దు చేస్తూ సంచలన తీర్పును వెలువరించింది. 11మంది దోషుల శిక్షను తగ్గించేందుకు ప్రభుత్వం చేసిన చర్యలను తప్పుబడుతూ కీలక నిర్ణయాన్ని వెలువరించింది అత్యున్నత న్యాయస్థానం. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బిల్కిస్‌ బానో కేసులో గుజరాత్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. 2002నాటి గుజరాత్‌ అల్లర్లలో బిల్కిస్‌ బానోపై అత్యాచారానికి ఒడిగట్టిన 11 మంది రేపిస్టులను విడుదల చేస్తూ, గుజరాత్‌ ప్రభుత్వం గత ఏడాది తీసుకున్న నిర్ణయం చెల్లదని ధర్మాసనం తేల్చిచెప్పింది.

రేపిస్టులను విడుదల చేసే అధికారం గుజరాత్‌ ప్రభుత్వానికి లేదని కరాఖండీగా చెప్పింది. 11మంది రేపిస్టుల విడుదలను సవాల్‌ చేస్తూ, బిల్కిస్‌ బానో దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణ అర్హత ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలతో 11మంది రేపిస్టులు మళ్లీ జైల్లో లొంగిపోవడం ఖాయమైంది. వీరిని 2022 ఆగస్ట్‌ 15వ తేదీన గుజరాత్‌ ప్రభుత్వం విడుదల చేసింది.

బిల్కిస్‌ బానోపై సామూహిక అత్యాచారం చేసిన ఘటనలో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11మంది దోషులను గతేడాది గుజరాత్ ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేసింది. వారికి రెమిషన్ మంజూరు చేసి జైలు నుంచి బయటకు విడుదల చేసింది. అయితే ఈ నిర్ణయంపై తీవ్ర మనస్తాపానికి గురయ్యారు బాధితురాలు బిల్కిస్ బానో. ఈ కేసులో దోషులుగా జీవితఖైదు అనుభవిస్తున్న వారిని జైలు నుంచి విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు బల్కిస్ బానో.

- Advertisement -

ఈ కేసుకు పూర్వాపరాలు పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం.. గుజరాత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది. తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు బిల్కిస్ బానో పిటిషన్ వేయడం సరైనదే అని తేల్చింది. దీంతో పాటు 11మంది దోషులను విడుదల చేస్తూ గుజరాత్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి చెల్లుచీటి ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement