Sunday, April 28, 2024

మెగాస్టార్ చిరంజీవి.. కృష్ణ ఫ్యాన్స్ యూనిట్ కి ప్రెసిడెంట్

మెగాస్టార్ చిరంజీవి కూడా అప్పట్లో ఒక స్టార్ హీరో అభిమాని మాత్రమే కాదు.. ఫ్యాన్స్ అసోసియేషన్ కి కూడా అధ్యక్షునిగా పనిచేశారు. ఆ స్టార్ హీరో ఎవరో కాదు నట శేఖర్ సూపర్ స్టార్ కృష్ణ. చిరంజీవి పద్మాలయ కృష్ణ ఫ్యాన్స్ యూనిట్ కి ప్రెసిడెంట్ అనే సంగతి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే తాజాగా కృష్ణ మరణించడంతో ఈ విషయం కాస్త మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అందుకు సంబంధించి ఒక పాంప్లేట్ కూడా వైరల్ గా మారుతోంది. అందులో కృష్ణ, చిరంజీవి కలిసి నటించిన తోడుదొంగలు సినిమా త్వరలో విడుదల కాబోతోంది అని పాంప్లెట్ లో చూపించడం జరిగింది. అయితే దీంతో మెగా అభిమానులు సూపర్ స్టార్ అభిమానులు ఒక్కసారిగా ఈ ఫోటోను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా ఘట్టమనేని అభిమానులకు కృష్ణ లేని లోటు తీర్చలేనిది.

Advertisement

తాజా వార్తలు

Advertisement