Friday, April 26, 2024

తోడబుట్టిన ఆశయానికి పుట్టినరోజు శుభాకాంక్షలు: చిరంజీవి

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు విషెస్ తెలుపుతున్నారు. మరోవైపు మెగా కుటుంబం నుంచి చాలా మంది హీరోలు ఒక్కొక్కరుగా పవన్ కళ్యాణ్‌కు తమదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కూడా తన ముద్దుల తమ్ముడికి అచ్చమైన తెలుగులో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి చిరంజీవి రాసిన మాటలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌ను చిరంజీవి ఒక నిప్పు కణంతో పోల్చారు. ‘చిన్నప్పటి నుంచి సమాజం గురించే కళ్యాణ్ ప్రతి ఆలోచన.. ప్రతి అడుగు పదిమందికి మేలు జరగాలని ప్రతిక్షణం పరితపించే నిప్పు కణం కళ్యాణ్.. అతని లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తోడబుట్టిన ఆశయానికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

ఈ వార్త కూడా చదవండి: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ వచ్చేసింది

Advertisement

తాజా వార్తలు

Advertisement