Wednesday, February 21, 2024

బీఎస్‌పీ తొలి జాబితా విడుదల చేసిన మాయావతి

లక్నో : బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్‌పీ) శనివారం తొలి జాబితాను విడుదల చేసింది. 53 మందితో కూడిన ఈ జాబితాను పార్టీ నేతలు వెల్లడించారు. 58 స్థానాలకు గాను 53 మందిని బీఎస్‌పీ ప్రకటించింది. ప్రతిపక్ష కూటమి అయిన ఎస్‌పీ, ఆర్‌ఎల్‌డీ పార్టీలు పశ్చిమ యూపీలో 13 టికెట్లు ముస్లిం నేతలకు కేటాయించిన నేపథ్యంలో బీఎస్‌పీకి ఇది ఛాలెంజ్‌గా నిలిచింది.

ఈ సందర్భంగా బీఎస్‌పీ చీఫ్‌ మాయావతి మాట్లాడుతూ.. తొలి ఫేజ్‌కు సంబంధించిన మిగిలిన ఐదు సీట్లను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటిస్తాం. మళ్లిd తమ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పుకొచ్చారు. 2017 ఎన్నికల్లో బీఎస్‌పీ 403 స్థానాల్లో పోటీ చేస్తే.. 19 స్థానాలను గెలుచుకుంది. ఎస్‌పీ-కాంగ్రెస్‌ కూటమి 54 స్థానాలు గెలిచాయి. 2007-12లో అధికారంలో ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల బుక్‌లెట్‌ను మాయావతి శనివారం విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement