Friday, March 29, 2024

ఉన్నావ్‌లో కాంగ్రెస్‌కు ఎస్‌పీ మద్దతు.. ఆశాసింగ్‌కు కాంగ్రెస్‌ టికెట్‌

యూపీ అసెంబ్లి ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ.. ఉన్నావ్‌ స్థానం నుంచి ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి తల్లి ఆశా సింగ్‌ను పోటీకి దింపింది. దీనిపై తాజాగా స్పందించిన సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌.. ఉన్నావ్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా ఉంటామని స్పష్టం చేశారు. ఆ స్థానం నుంచి ఎస్‌పీ పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఉన్నావ్‌ అత్యాచార కేసు బాధితురాలి తల్లికి తాము అడ్డురామని స్పష్టం చేశారు. ఆమెకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement