Monday, February 26, 2024

ర‌జ‌నీకాంత్ కుమారై ఇంట్లో భారీ చోరీ

నిర్మాత‌..న‌టుడు ర‌జ‌నీకాంత్ కుమారై ఐశ్వ‌ర్య ఇంట్లో భారీ చోరీ జ‌రిగింది. చెన్నైలోని ఆమె నివాసంలో 60 సవర్ల బంగారం (480 గ్రాములు/48 తులాలు), వజ్రాభరణాల జ్యుయలరీ చోరీకి గురైనట్టు తెయాన్ మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లాకర్ లో ఉంచినవి కనిపించడం లేదని ఆమె పేర్కొన్నారు. 2019లో జరిగిన తన సోదరి సౌందర్ వివాహ వేడుకలో ఈ ఆభరణాలు ధరించినట్టు తెలిపారు. ఆ తర్వాత నుంచి బయటకు తీయలేదని పేర్కొన్నారు. ఐశ్వర్య తన ఇంటిలోని లాకర్ లో ఉంచగా, ఈ విషయం కొంత మంది పనివారికి తెలుసునని ఎఫ్ఐఆర్ కాపీ చెబుతోంది.

సెక్షన్ 381 కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ఐశ్వర్య ప్రస్తుతం లాల్ సలామ్ సినిమాతో బీజిగా ఉన్నారు. షూటింగ్ కోసం తమిళనాడు వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఆమె ఇంట్లో లేకపోవడంతో ఈ చోరీ జరిగినట్టు తెలుస్తోంది. డైమంట్ సెట్స్, పురాతన బంగారం పీసులు, నవరత్న సెట్స్, గాజులు పోయిన వాటిల్లో ఉన్నాయి. తన దగ్గర పనిచేసే ఈశ్వరి, లక్ష్మీ, డ్రైవర్ వెంకట్ పై అనుమానం వ్యక్తం చేశారు. ఈ లాకర్ ను ఆమె పలు సందర్భాల్లో వేర్వేరు ఇళ్లకు తరలించినట్టు వివరించారు. 2022 ఏప్రిల్ లో పోయస్ గార్డెన్ లోని నివాసానికి లాకర్ ను తరలించారు. తనకు వివాహమైన తర్వాత నుంచి గత 18 ఏళ్లలో సమకూర్చుకున్న ఆభరణాల్లో కొన్ని లేవని గుర్తించి షాక్ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement