Sunday, June 23, 2024

భారీగా గంజాయి పట్టివేత..

అక్ర‌మంగా గంజాయి త‌ర‌లిస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఏపీ ఆబ్కారీ, పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు. ఇవాళ జ‌రిపిన ఏకకాల సోదాల్లో భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మూడు జిల్లాలో సాగిన సోదాల్లో దాదాపు మూడు వందల కిలోల వరకు ఉన్న గంజాయిని పట్టుకున్నారు. విశాఖ నుంచి కేరళకు కారులో తరలిస్తున్న గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని మంగళగిరి పోలీసులు అరెస్టు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో 168 కిలోల గంజాయిని అరకునుంచి విశాఖకు ఆటోలో తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేయగా మరొకరు పరారీలో ఉన్నారు. గంటూరు జిల్లా కాజ టోల్ ప్లాజా వద్ద 100 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement