Wednesday, February 21, 2024

Tamil Nadu: భారీ అగ్నిప్రమాదం.. రూ.100 కోట్ల ఆస్తి నష్టం

తమిళనాడు రాష్ట్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉత్తర చెన్నైలోని మనాలి సమీపంలోని వైకాడు ప్రాంతంలోని సబ్బు పొడి గోదాములో ఇవాళ ఉదయం భారీ ఎత్తున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈప్రమాదంలో దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన వస్తువులు నష్టపోయాయి. వెంటనే ఆరు అగ్నిమాపక యంత్రాలు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి. గత ఐదు గంటలుగా మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement