Thursday, May 16, 2024

సెక్రటేరియట్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి : మంత్రి వేముల

సెక్రటేరియట్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, దానికి తగ్గట్టు వర్క్ ఫోర్స్ డబుల్ చేయాలని వర్క్ ఏజెన్సీ ని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈరోజు నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. సుమారు 4 గంటల పాటు సెక్రటెరియట్ నిర్మాణ ప్రాంగణమంతా కలియ తిరుగుతూ నిర్మాణంలో ఉన్న ప్రతి పనిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈసందర్భంగా రెడ్ స్టోన్ రాతి కట్టడం నిర్మాణ పనుల కోసం రాజస్థాన్ నుండి 50 మంది మేస్త్రీలను ప్రత్యేకంగా తెప్పించాలని వర్క్ ఏజెన్సీని ఆదేశించారు. ఎలివేషన్ వచ్చే జీఆర్సీ క్లాడింగ్ పనుల నిపుణులను వెంటనే తెప్పించి రౌండ్ పిల్లర్ల నగిషీల పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. గ్రానైట్, ఫ్లోరింగ్ పనుల్లో ఇంకా వేగం పెంచాలన్నారు.

యూపీవీసీ విండో పనులు, ఫాల్ సీలింగ్ పనులు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, మిగిలి ఉన్న సివిల్ పనులను సమాంతరంగా చేపట్టాలన్నారు. ఈ పనులన్నీ సమాంతరంగా జరిగేలా ఆర్ అండ్ బి ఇంజనీర్లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. కాంపౌండ్ వాల్ కి వచ్చే రేయిలింగ్ పనులను వెంటనే మొదలు పెట్టాలన్నారు. 32 డోము నిర్మాణాలకు గాను 16 డోముల నిర్మాణం పూర్తయిందని, మరో 8 డోముల స్ట్రక్చరల్ పనులు పూర్తి కాగా.. మిగతా డోముల నిర్మాణాలు కూడా తొందరగా చేపట్టాలన్నారు. ప్రస్తుతం సెక్రటేరియట్ నిర్మాణం కోసం 1450 మంది వర్కర్లు పనిచేస్తున్నారన్నారు. ఇంకో 1000 మంది స్కిల్ లేబర్ లను వెంటనే సమకూర్చుకోవాలని ఏజెన్సీ ని మంత్రి ఆదేశించారు. సెక్రటేరియట్ నిర్మాణ ప్రాంగణంలోని ప్రార్ధన మందిరాల నిర్మాణ పనులను పరిశీలించారు. గుడి, మసీదు, చర్చ్, సెక్యూరిటీ బ్లాక్, ఆన్స్లరీ బిల్డింగ్ ల పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి వేముల ఆదేశించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement