Tuesday, May 7, 2024

Martial Rape Judgement వైవాహిక అత్యాచారం నేరం కాదు.. తేల్చి చెప్పిన హైకోర్టు ..

అలాహాబాద్ – వైవాహిక బంధంలో బ‌ల‌వంత‌పు లైంగిక చ‌ర్య‌ను నేరంగా ప‌రిగ‌ణించ‌లేమ‌ని అల‌హాబాద్ హైకోర్టు నేడు తీర్పు ఇచ్చింది.. వివాహ‌మైన త‌ర్వాత త‌న భ‌ర్త బల‌వంతంగా అత్యాచారానికి పాల్ప‌డ్డార‌ని, ఈ సంద‌ర్భంలో త‌న‌ను శారీరికంగా హింసించ‌డాన్ని ఓ భార్య వేసిన పిటిష‌న్ను విచారించిన కోర్టు భార్యకు 18 సంవత్సరాలు నిండితే భారతీయ శిక్షాస్మృతి ప్రకారం.. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేమని తీర్పును ఇచ్చింది. ‘అసహజ నేరం’ కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న భర్తను నిర్దోషిగా తేల్చింది. నిందితుడిని ఐపీసీ సెక్షన్ 377 కింద దోషిగా నిర్ధారించలేమని జస్టిస్ రామ్‌మనోహర్ నారాయణమిశ్రా ధర్మాసనం తెలిపింది. వివాహ‌బంధంతోనే భార్య‌,భ‌ర్త‌ల మ‌ధ్య లైంగిక చ‌ర్య హ‌క్కుగా వ‌స్తుంద‌ని, ఇందులో బ‌ల‌వంతం చేయడం నేర‌కాద‌ని పేర్కొంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement