Friday, May 3, 2024

ద‌స‌రా మూవీ పోస్ట‌ర్ -రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేక‌ర్స్

ద‌స‌రా మూవీ నుండి కొత్త పోస్ట‌ర్ ని రిలీజ్ చేస్తూ రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పారు మూవీ మేక‌ర్స్. ఈ పోస్ట‌ర్ లో నేచుర‌ల్ స్టార్ నాని కూర్చుని ఉండ‌గా ఆయ‌న వెన‌కాల న‌టి సిల్క్ స్మిత ఫొటో క‌నిపిస్తోంది. కాగా ఈ మూవీకి డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ కీర్తి సురేశ్ ఇందులో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాక‌ర్ చెరుకూరి ఈ పిక్చర్ ను ప్రొడ్యూస్ చేస్తున్నారు.ఈ మూవీకి సంతోష్ నారాయ‌ణ‌న్‌, సత్యన్ సూర్యన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీని మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నాని ఊర మాస్‌ పోస్టర్‌ ను రిలీజ్‌ చేశారు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ పిక్చర్ షూటింగ్ 30 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement