Monday, April 29, 2024

Crime: మెడ‌కు చుట్టుకున్న మాంజాదారం… సైనికుడు మృతి

మాంజా దారం మెడకు చుట్టుకొని సైనికుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్‌ లంగర్‌హౌస్‌లో చోటుచేసుకుంది. విశాఖపట్నానికి చెందిన కోటేశ్వరరావు కొన్నాళ్లుగా సైన్యంలో పనిచేస్తున్నారు.

విధులు ముగించుకొని ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వెళ్తుండగా లంగర్‌హౌస్‌ పైవంతెన వద్ద పతంగుల మాంజా దారం మెడకు చుట్టుకొని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే సమీప ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement