Tuesday, April 30, 2024

రామ్ చ‌ర‌ణ్ పేరుని ప‌ల‌క‌లేక సారీ చెప్పిన‌.. అమెరిక‌న్ న‌టి

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ అవార్డుల ప్ర‌దానోత్స‌వం వేడుక‌లో ప్ర‌జెంట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.కాగా హాలీవుడ్ నటి అంజలి భీమానీతో కలిసి స్టేజ్ పైకి రావాల్సి ఉంది. వారిద్దరినీ ఆహ్వానించే సమయంలో అమెరిక‌న్ న‌టి టిగ్ నొటారో తడబడ్డారు. ఆర్ఆర్ఆర్ తో విజయం అందుకున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్టార్ రామ్.. అని కొంచెం గ్యాప్ ఇచ్చారు. చివరి పేరు ఎలా పలకాలో తెలియడం లేదన్నారు. మైక్రో ఫోన్ లో వెనుక నుంచి పేరు చెప్పడంతో ‘చ్చరాన్’ అన్నారు. తనకు పక్క నుంచి సాయం చేశారని చెప్పారు. తర్వాత కూడా ‘రామ్ చరాన్’ అన్నారు. తర్వాత అంజలి భీమానీ పేరు పలకడంలోనూ ఇబ్బందిపడ్డారు. అంజలీ.. భీమానీ అంటూ గ్యాప్ ఇచ్చి పేరు పలికారు. దీంతో ఆడియన్స్ నవ్వేశారు. ఇక వారిద్దరూ స్టేజ్ ఎక్కి వస్తుండగా ఎదురెళ్లిన టిగ్ నొటారో.. రామ్ చరణ్ కు క్షమాపణలు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement