Friday, November 8, 2024

Madya Pradesh – శ్రీకృష్ణుడితో వివాహం… పూజించే దేవుడినే వ‌రించిన యువ‌తి

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గ్వాలియర్‌లో ఓ యువతి తాను చిన్నప్పుటి నుంచి ఎంతో ఆరాధన భావంతో కొలిచిన శ్రీకృష్ణ పరమాత్ముడిని పెళ్లి చేసుకుంది. తన బంధుమిత్రుల సమక్షంలోనే ఈ వివాహ కార్యక్రమం వైభవంగా జ‌రిగింది. గ్వాలియర్ నగరంలోని న్యూ బ్రజ్‌ విహార్‌ కాలనీలో ఉంటున్న శివాని పరిహారకు చిన్నటి నుంచి శ్రీ కృష్ణుడు అంటే అమితమైన ప్రేమ, భక్తి ఉండేవి. అలా వయసు పెరిగే కొద్ది కృష్ణుడిపై మరింత ప్రేమ పెరిగింది. చివరికి అత‌డినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.

త‌ల్లిదండ్రుల‌ను ఒప్పించి..

ఈ నేపథ్యంలో.. ఆ యువ‌తి త‌న తల్లిదండ్రులను ఒప్పించి శ్రీకృష్ణ పరమాత్ముని విగ్రహంతో పెళ్లి చేసుకుంది. స్థానిక గుడిలో వేదమంత్రాల సాక్షిగా ఈ వివాహం జరిగింది. వివాహం తర్వాత శివానికి వివాహ ప్రమాణం పత్రం కూడా అధికారులు అందజేశారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడి విగ్రహంతో శివాని బృందావనానికి బయలుదేరగా.. తన పూర్తి జీవితాన్ని బృందావనంలోని రాధా ధ్యాన్ ఆశ్రమంలో సేవలు చేస్తూ గ‌డ‌ప‌నున్న‌ట్టు తెలిపింది. శివాని తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తమ కుమార్తె పెళ్లి విషయంలో తాము మొదట సంశయించామని, కాకపోతే ఆమె పట్టుదల చూసి అంగీకరించినట్లు తెలిపారు. కుటుంబ ఆచారాల వ్యవహారాలను అనుసరించి వధువుకు అప్పగింతల కార్యక్రమాన్ని కూడా నిర్వ‌హించి కుమార్తెను బృందావ‌నానికి సాగ‌నంపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement