Thursday, April 25, 2024

పాప్ కార్న్ చిత్రంలో సాంగ్ రిలీజ్ చేసిన.. నాగ‌చైత‌న్య‌

మురళీ గంధం ద‌ర్శ‌కత్వం వహించిన చిత్రం పాప్ కార్న్. ఈ చిత్రం నుండి మది విహంగ‌మ‌య్యే లిరిక‌ల్ సాంగ్ ని రిలీజ్ చేశారు హీరో నాగ‌చైత‌న్య‌.ఈ చిత్రంలో అవికా గోర్‌ – సాయి రోన‌క్ జంట‌గా న‌టించారు. భోగేంద్ర గుప్తా నిర్మించారు. లిరిక్ రైట‌ర్ శ్రీజో. శ్ర‌వ‌ణ్ భ‌రద్వాజ్ సంగీతం అందించిన ఈ పాట‌ను బెన్నీ ద‌యాల్‌, ర‌మ్యా బెహ్రా ఆల‌పించారు. ఈ సినిమాను గురించి మేకర్స్ మాట్లాడుతూ .. ‘పాప్ కార్న్’ మూవీని ఫిబ్ర‌వ‌రి 10న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. ఇప్ప‌టి వ‌ర‌కు రాన‌టువంటి ఓ డిఫ‌రెంట్ కాన్సెప్ట్ మూవీ ఇది. సినిమా అంతా లిఫ్టులోనే ఉంటుంది. ముఖ్యంగా చివ‌రి 45 నిమిషాలు అయితే సీట్ ఎడ్జ్ మూవీలా ఉంటుంది. పెద్ద‌ల‌కు వారి యంగ్ ఏజ్ గుర్తుకు వ‌స్తుంది. ఇప్ప‌టి యువ‌త‌కు కూడా క‌నెక్ట్ అవుతుంది. అన్ని ర‌కాల ఎమోష‌న్స్ ఉన్న సినిమా, అన్ని వర్గాల వారికి తప్పకుండా నచ్చుతుంద‌న్నారు.ఫిబ్రవరి 10న ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. సినిమా ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ జోరుగా సాగుతున్నాయి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement