Sunday, April 14, 2024

మీరు బ్రతకండి, ఇతరులను కూడా బ్రతకనివ్వండి.. ట్వీట్ చేసిన మనోజ్

న‌టుడు మంచు మ‌నోజ్ అనుచ‌రుడు సార‌థిపై త‌న అన్న‌..న‌టుడు విష్ణు చేయి చేసుకోవ‌డం, దాంతో పాటుగా ఇండ్లలోకి వచ్చి మా వాళ్లను, బంధువులను ఇలా కొడుతుంటారండి. ఇదీ ఇక్కడి పరిస్థితి అంటూ మనోజ్‌ వీడియోలో చెప్పుకురావడం పెద్ద సంచలనమే రేపింది. దీనిపై ఇటీవలే విష్ణు స్పందించి.. ఇవి అన్నదమ్ములు మధ్య ఉండే చిన్న చిన్న తగాదాలే అని తెలిపాడు. కాగా తాజాగా మంచు మనోజ్‌ సోషల్‌ మీడియాలో ఆసక్తికర ట్వీట్స్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.కళ్ల ముందు జరుగుతున్న తప్పులను చూసి చూడనట్టు వదిలేయడం కన్నా నిజం కోసం పోరాడి చావడానికైనా సిద్ధమే, క్రియేటివిటీకి నెగెటివిటీయే శత్రువు అంటూ రెండు కోట్‌లను షేర్‌ చేస్తూ మీరు బ్రతకండి, ఇతరులను కూడా బ్రతకనివ్వండి అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement