Saturday, May 11, 2024

రాబోయే నాలుగు రోజుల్లో తేలికపాటి వర్షాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాష్ట్రంలో నైరుతి, పశ్చిమ దిశల నుంచి కింది స్థాయి గాలులు వీస్తాయని తెలిపింది.

రాగల 48 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో హైదరాబాద్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ మినహా అన్ని జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసినట్లు వివరించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement