Monday, April 29, 2024

Leopard – దామరగిద్దలో చిరుత మృతి

మహబూబ్నగర్ ప్రభ న్యూస్దామరగిద్ద మండలం వత్తుగుండ్ల గ్రామ శివారులో కలకలం సృష్టించిన చిరుత పులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అనారోగ్యంతో ఉన్న చిరుత నిస్సహాయ స్థితిలో పొలాల వెంట నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్క సారి కుప్పకూలి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న అటవీ, పోలీస్ సిబ్బంది పులి మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం ఎలా చనిపోయింది అనే విషయాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement