Friday, October 4, 2024

రానా నాయుడు సీజన్ 2 పై లేటెస్ట్ అప్‌డేట్

విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి కలిసి చేసిన బాలీవుడ్ సిరీస్ రానా నాయుడు. గత నెలలో రిలీజ్ అయిన ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ఓవర్గం ప్రేక్షకులను మాత్రం విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ సిరీస్‌లో మాట్లాడే భాష, పదాలపై మాత్రం బాగా చర్చ జరిగింది. ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వెంకీ నుంచి అసభ్యకరమైన మాటలు వినడం తెలుగు ప్రేక్షకులకు అంతగా రుచించలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా రానా నాయుడు సిరీస్ మేకర్స్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ఇలాంటి క్యారెక్టర్ ఎందుకు ఒప్పుకున్నారంటూ వెంకటేష్‌పై కూడా విస్తృతంగా చర్చ జరిగింది. కాగా, తాజాగా రానా నాయుడుకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

రానా నాయుడు సీజన్ 2కు త్వరలోనే రానున్నట్టు ప్రకటిచనున్నారు మేకర్స్. రానా, నాగాల కలహాలు, మనస్పర్థలు, మూర్ఖత్వాలను మరోసారి బుల్లితెరపై చూడొచ్చని ప్రకటించారు. ఈ సారి మరిన్నీ మలుపులు, షాక్‌లతో రానా నాయుడు సిరీస్ ఆకట్టుకుంటుందని తెలిపారు. ఈ సిరీస్‌లోని పాత్రల సంఘర్షణలు, బలమైన వ్యక్తులు- సెలబ్రెటీలు ఒకరితో ఒకరు పోరాడినప్పుడు ఏర్పడే అల్లకల్లోలాలను, విడిపోయిన కుటుంబంలో తలెత్తే సమస్యలను చూపించి మొదటి సీజన్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుందని, అందుకే రెండో సీజన్‌ను కూడా రూపొందించనున్నట్లు స్పష్టం చేశారు.

- Advertisement -

అమెరికన్ టీవీ సిరీస్ రే డోనోవన్‌కు రీమేక్‌గా రానా నాయుడు తెరకెక్కింది. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ సంయుక్తంగా తెరకెక్కించారు. లోకోమోటివ్ గ్లోబల్ మీడియా పతాకంపై సుందర్ ఆరోన్ ఈ సిరీస్‌ను నిర్మించారు. ఇందులో సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, ఆశిష్ విద్యార్థి, గౌరవ్ చోప్రా, సుచిత్రా పిళ్లై తదితరులు కీలక పాత్రలు పోషించారు. మార్చి 10 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement