Sunday, April 28, 2024

కారెక్కనున్న ఎల్ రమణ.. ముహూర్తం ఎప్పుడంటే..

తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం కుదిరింది. ఇప్పటికే టీటీడీపీ అధ్యక్ష పదవికి, తెలుగుదేశం ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసిన రమణ.. సోమవారం టీఆర్ఎస్  పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకోనున్నారు. ఆయనకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాథమిక సభ్యత్వం ఇవ్వనున్నారు. అనంతరం ఈ నెల 16న సహచరులతో కలిసి టీఆర్ఎస్‌లో చేరనున్నారు.

కాగా, రెండు రోజుల క్రితం టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎల్. రమణ రాజీనామా చేశారు. గత కొంత కాలంగా టీడీపీని వీడి  టీఆర్ఎస్ లో చేరాలని ఎల్. రమణ భావిస్తున్నారని ప్రచారం జరిగింది. రమణతో  తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలవంతమయ్యాయి. దయాకర్ రావు దగ్గరుండి గురువారంనాడు రమణను  కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. సీఎం కేసీఆర్ తో భేటీ అనంతరం ఎల్. రమణ భేటీ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. తన రాజీనామా పత్రాన్ని శుక్రవారం చంద్రబాబునాయుడు పంపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement