Wednesday, May 1, 2024

బీమా పాలసీలకు కేవైసీ.. కొత్త సంవత్సరంలో పలు మార్పులు

కొత్త సంవత్సరంలో ఆర్ధిక వ్యవహారాల్లో పలు మార్పులు జరగనున్నాయి. ప్రధానంగా బీమా పాలసీల కొనుగోలుకు కేవైసీ, ఎన్‌పీఎస్‌ పాక్షిక విత్‌డ్రా, క్రెడిట్‌ కార్డు రివార్డ్‌ పాయింట్స్‌ ఇలా కొన్ని మార్పులు రానున్నాయి. 2023 జనవరి 1 నుంచి అన్ని రకాల పాలసీలు తీసుకోవాలన్నా, పునరుద్ధరించాలన్న ఐఆర్‌డీఏఐ వేవైసీ తప్పనిసరి చేసింది. జీవిత బీమా, ఆరోగ్య బీమా, మోటార్‌ ఇన్సూరెన్స్‌, గృహ బీమా ఇలా అన్ని రకాల బీమా పాలసీలకు ఇక నుంచి కేవైసీ నిబంధనలు పాటించడం తప్పనిసరి. ప్రస్తుతం లక్ష కంటే ఎక్కువ విలువున్న ఆరోగ్య పాలసీలకు మాత్రమే కేవైసీ పత్రాలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు జీవిత బీమా కాని సాధారణ బీమా పాలసీలు తీసుకోవడానకి కేవైసీ తప్పనిసరికాదు. జనవరి 1 నుంచి అన్ని రకాల పాలసీలకు కేవైసీ తప్పనిసరి.

నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎస్‌) పాక్షిక విత్‌డ్రా రూల్స్‌లోనూ మార్పులు చేశారు. దీనికి సంబంధించి జనవరి 1 నుంచికొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. పాక్షిక విత్‌డ్రాల కోసం నోడల్‌ ఆఫీస్‌ ద్వారా రిక్వెస్ట్‌ పంపించాల్సి ఉంటుంది. దీనికి సపోర్టింగ్‌ డాక్యుమోంట్లు కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఇప్పటి వరకు పాక్షిక విత్‌డ్రాకు సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇస్తే సరిపోయేది. జనవరి 1 నుంచి దీనికి కూడా కేవైసీ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది.

లాకర్లకు కొత్త రూల్స్‌

- Advertisement -

బ్యాంక్‌ లాకర్లకు సంబంధించిన 2022లో అరంభంలోనే ఆర్‌బీఐ కొత్త నిబంధనలు తీసుకు వచ్చింది. వాటిని ఆగస్టు నెలలో సమీక్షించి కొన్ని మార్పులు చేసింది. అవే కొత్త సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే లాకర్‌ సదుపాయం తీసుకున్న కస్టమర్లు తమ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవాలని బ్యాంక్‌లు సూచించాయి. లాకర్‌ ఒప్పందంలో ఎలాంటి అనైతిక షరతులను చేర్చడానికి వీల్లేదనికొత్త నిబంధనల్లో ఆర్‌బీఐ స్పష్టం చేసింది. క్రెడిట్‌ కార్డుల రివార్డు పాయింట్స్‌లోనూ కొన్ని బ్యాంక్‌లు మార్పులు చేశాయి. ఇవి జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కొనుగోళ్లు చేసే సమయంలో బ్యాంక్‌లు క్రెడిట్‌ కార్డు హోల్డర్లకు రివార్డు పాయింట్లు ఇస్తుంటాయి. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు రివార్డు పాయింట్ల రిడీమ్‌ విషయంలో మార్పులు చేశాయి.

పెరగనున్న కార్ల ధరలు

కొత్త సంవత్సరంలో దాదాపు అన్ని కంపెనీల కార్ల ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే ఆయా కంపెనీలు ఏ మోడల్స్‌పై ఎంత పెరగనుంది ప్రకటించాయి. బీఎస్‌ 6.1 నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో వాహన కంపెనీలు అన్ని డిసెంబర్‌ 31 వరకు డిస్కౌంట్‌ ఆఫర్‌ చేశాయి. తమ వద్ద ఉన్న బీఎస్‌ 6 వాహనాలను గడువులోగా అమ్మేందుకు కార్ల కంపెనీలు రాయితీలు ఇచ్చాయి. జనవరి 1 నుంచి మాత్రం కార్ల ధరలు పెరుగుతాయి. టాటా మోటార్స్‌, మారుతీ సుజుకీ, ఆడీ, మెర్సిడెస్‌ బెంజ్‌, హుండ్యాయ్‌, వంటి పలు కంపెనీలు కార్ల ధరలను పెంచాయి. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఉద్గార నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇక నుంచి కంపెనీలు బీఎస్‌ 6.1 వెర్షన్‌ కార్లనే విక్రయించాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement