Friday, May 3, 2024

అక్కడ అడ్డుకున్నారు… ఇక్కడ ప్రాణం పోస్తున్నారు

మహమ్మారి కరోనా బారినపడి పొరుగు రాష్ట్రమైన తెలంగాణకు చికిత్స కోసం అంబులెన్స్ లో వెళ్తున్న వారిని.. సరిహద్దు బార్డర్ లోనే అక్కడి  పోలీసులు అడ్డుకుంటూ మానవత్వాన్ని వివరిస్తుండగా, కర్నూల్ పోలీసులు మాత్రం కరోనా బారినపడి ఇక్కడికి వచ్చే వారికి మాత్రం ప్రాణాలు పోస్తున్నారు. ఈ క్రమంలోనే బళ్లారి నుంచి కర్నూల్ కి వచ్చిన రోగికి సంబంధించిన ఆక్సిజన్ అయిపోయిన విషయాన్ని తెలుసుకున్న జిల్లా ఎస్పీ అప్పటికప్పుడే పోలీస్ వెల్ఫేర్ ఫండ్ ద్వారా ఆక్సిజన్ రోగికి  ప్రాణం పోశారు.

తెలంగాణ రాష్ట్రం నుండి రోజూకు కర్నూలు నగరంలో వివిధ హాస్పిటల్స్ కు వందల సంఖ్యలో  కరోనా పేషంట్లు వస్తుండడంతో మెరుగైన చికిత్స అందించేందుకు కృషి చేస్తున్నారు. అంతేకాదు తెలంగాణ పోలీసులు కర్నూలు బార్డర్ లో పలు అంబులెన్సులను నిలిపి వేయగా, టోల్ గేట్ వద్ద నిలిచిన అంబులెన్స్ లలో ఆక్సిజన్ సిలిండర్లు చివరిదశలో ఉన్న విషయం తెలుసుకుని స్వయంగా జిల్లా ఎస్పీ  ఆక్సిజన్ సిలిండర్లు తీసుకెళ్ళి అంబులెన్స్ ల వారికి శుక్రవారం అందజేశారు. ప్రాణ ప్రాయంలో ఉన్న రోగులకు ఆక్సిజన్ అందించడంతో వారికి ప్రాణపాయస్ధితి తప్పిపోయింది. అంతేకాదు రోగుల ఆరోగ్య పరిస్ధితి గురించి ఎస్పీ ప్రత్యేకంగా తెలుసుకున్నారు. ప్రాంతాలు, కుల, మతాలు ఏవి మానవత్వానికి అడ్డు రావని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.ప్రాణప్రాయంలో ఉన్న వారిని కాపాడేందుకు ఆక్సిజన్ సిలిండర్లు తెచ్చి ఇచ్చామని జిల్లా ఎస్పీ  తెలిపారు. మనిషిగా పుట్టాక ఏవరైనా కూడా  మానవత్వంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement