Sunday, April 28, 2024

కేయు ఇన్స్ పెక్టర్ దయాకర్ సస్పెండ్.. భూవివాహదం కేసు కారణం

వరంగల్ క్రైమ్, (ప్రభ న్యూస్) : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కే.యూ.సి ఇన్స్ పెక్టర్ దయాకర్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. భూ వివాదంలో కేసు నమోదు చేయకుండ నిర్లక్ష్యంగానే కాక బాధ్యతారహిత్యంగా వ్యవహరించడాన్ని పోలీస్ కమీషనర్ తప్పుపట్టారు. అలాగే ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకపోగా భాదితులను పలుమార్లు స్టేషన్ కు తిప్పిస్తూ మానసిక వేదనకు గురి చేసిన్నట్టు పోలీసులు జరిపిన విచారణలో తేలింది.

పైగా కె యూ ఇన్స్ పెక్టర్ ప్రోత్సాహంతోనే బయటి వ్యక్తులతో సెటిల్మెంట్ ప్రయత్నిస్తుందుకు ఆగ్రహం కలిగించింది. పోలీసు అధికారిగా బాధితులకు అండదండగా నిలువక పోగా భూ అక్రమణదారులకు వంత పాడే విధంగా వ్యవహరించడంతో కె.యూ.సి ఇన్స్ స్పెక్టర్ దయాకర్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి.రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. భూ కబ్జాదారులను ప్రోత్సహించే విధంగా కె.యూ.సి ఇన్స్ స్పెక్టర్ దయాకర్ ప్రవర్తించడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ సస్పెండ్ వేటు వేశారు.

- Advertisement -

నెల రోజుల క్రితం హసన్ పర్తి ఇన్స్ పెక్టర్ నరేందర్ సైతం భూ వివాహదంలో జోక్యం చేసుకుని వెఫన్ తో బెదిరించారనే అభియోగంపై సస్పెండ్ వేటు పడింది. ఇప్పుడు కేయు ఇన్స్ పెక్టర్ ధయాకర్ పై సస్పెన్షన్ వేటు పడటంతో పోలీసు వర్గాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అవినీతి,అక్రయాలపైనే కాకుండా విధి నిర్వహణలో నిర్లక్యంగా, బాధ్యతరహిత్యంగా వ్యవహరించడం పైన పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ సీరియస్ గానే ప్రతి స్పందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement