Tuesday, March 26, 2024

ఆక‌ట్టుకుంటోన్న కృష్ణ వ్రింద విహారి మూవీ ట్రైల‌ర్

హీరో నాగ‌శౌర్య న‌టిస్తోన్న కృష్ణ‌వ్రింద విహారి మూవీ ట్రైల‌ర్ ని మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం ప్యూర్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా ప్రేక్షకులు ముందుకు రానుంది. దర్శకుడు అనీశ్ ఆర్ కృష్ణ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా, ఉషా ముల్పూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అబ్బాయి, ఉద్యోగం రిత్యా పట్టణానికి వచ్చి, ఇక్కడ ఒక సూపర్ ఫాస్ట్ అమ్మాయిని ప్రేమించడంతో.. అతడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు అనేది ఈ సినిమా కథగా ఉండబోతున్నట్లు మనకు ట్రైలర్‌లో చూపెట్టారు. ఇక నాగశౌర్య మరోసారి తన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో అందాల భామ షిర్లే సెటియా హీరోయిన్‌గా నటిస్తోండగా బ్రహ్మాజీ, రాధికా శరత్ కుమార్ ..వెన్నెల కిషోర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా ఉండటంతో, ప్రేక్షకులను ఇది బాగా అలరిస్తోంది. ఈ సినిమాను సెప్టెంబర్ 23న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement