Tuesday, September 24, 2024

సాత్విక్ ఆత్మ‌హ‌త్య -దోషుల‌కు క‌ఠిన శిక్ష ప‌డాల‌ని కోరుతూ ఎంపి కోమ‌టిరెడ్డి దీక్ష‌..

హైదరాబాద్‌: నార్సింగి శ్రీచైతన్య కాలేజీ ఇంట‌ర్ విద్యార్ధి సాత్విక్ మృతికి కారణమైన వారిని అరెస్టు చేయాలని కోరుతూ, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాలేజీ వద్ద దీక్ష చేపట్టారు. సాత్విక్ సూసైట్‌ నోట్‌లో పేర్కొన్న నలుగురిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యుల్ని అరెస్ట్ చేసేవరకు తాను దీక్ష చేస్తానని చెప్పారు. శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థులకు బోధించేంకు క్వాలిఫైడ్ లెక్చరర్స్ కూడా లేరని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. ఐఐటీ పేరుతో విద్యార్థులను మోసం చేసి రూ.లక్షల వసూలు చేసి వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. వారిపై హెచ్‌ఆర్‌డీకి కూడా ఫిర్యాదు చేశానని, న్యాయపరంగా కూడా పోరాటం చేస్తానని చెప్పారు. కాలేజీలో విద్యార్థులను కొట్టడం, దూషించడం వంటి హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement