Tuesday, November 5, 2024

3rd Test : ఓటమి అంచున భారత్.. ఆసీస్ టార్గెట్ 76 ప‌రుగులు

ఇండోర్ లో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో రెండో రోజు మ్యాచ్ కొన‌సాగుతోంది. భార‌త్ జ‌ట్టు 163 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది. దీంతో ఆస్ట్రేలియా విజ‌య‌ల‌క్ష్యాన్ని చేరుకోవాలంటే 76 ప‌రుగులు చేయాల్సి ఉంది. భార‌త్ బ్యాట్స్ మెన్లు ఛ‌టేశ్వ‌ర్ పుజారా 59 ప‌రుగులు, శ్రేయాస్ అయ్య‌ర్ 26 ప‌రుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌల‌ర్లు నాథ‌న్ ల‌యాన్ 8 వికెట్లు తీయ‌గా, స్టార్క్ ఒక వికెట్, కుహ్నెమాన్ ఒక‌టి చొప్పున వికెట్లు తీశారు. దీంతో ఈ టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఓటమి అంచున ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement