Thursday, May 16, 2024

కేఎల్‌ డీమ్డ్‌ టు బీ వర్సిటీ, కేఎల్‌ గ్లోబల్‌ బిజినెస్‌ స్కూల్‌.. అందుబాటులో అంతర్జాతీయ కోర్సులు

గ్రాడ్యుయేషన్‌, ఉన్నత విద్య కోసం దేశంలో సుప్రసిద్ధ యూనివర్సిటీలలో ఒకటైన కేఎల్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్సిటీ సోమవారం కేఎల్‌హెచ్‌ గ్లోబల్‌ బిజినెస్‌ స్కూల్‌ను ప్రారంభించింది. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన వ్యాపార కోర్సులు కోసం ప్రత్యేకంగా అంకితం చేయబడిన ఆల్ట్రా మోడల్‌ బీ – స్కూల్‌ కేఎల్‌హెచ్‌ గ్లోబల్‌ బిజినెస్‌ స్కూల్‌. హైదరాబాద్‌లోని కొండాపూర్‌ వద్ద కార్పొరేట్‌ కార్యాలయాల సమీపంలో ఏర్పాటు చేయబడిన కేఎల్‌హెచ్‌ జీబీఎస్‌, టాప్‌ ర్యాంకింగ్‌ ప్రోగ్రామ్‌లను అందించడంతో పాటుగా న్యాక్‌, ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ నుంచి ప్రతిష్టాత్మకమైన అక్రిడిటేషన్‌లను సైతం కలిగి ఉంది.

అందుబాటులో సాంకేతికత..

ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా కేఎల్‌ డీమ్డ్‌ టు బీ వర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ జీపీ సారథి వర్మ మాట్లాడుతూ.. నూతన కేఎల్‌ గ్లోబల్‌ బిజినెస్‌ స్కూల్‌ వద్ద తాము విద్యార్థుల కెరీర్‌ను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా థియరీ, ప్రాక్టిస్‌ను అత్యాధునిక సాంకేతికతతో మిళితం చేస్తున్నామన్నారు. తాము యువ, సాధించాలనే తపన, వ్యవస్థాపక ఆలోచనలు కలిగిన యువతకు అనుబంధంగా ప్రత్యేకంగా తీర్చిదిద్దిన కోర్సులను అందిస్తున్నామని తెలిపారు. తమ వినూత్న బోధనా విధానం, హార్వార్‌ ్డ కేస్‌ మెథడాలజీతో ఉంటుందన్నారు. మార్కెట్‌ ఆధారిత ప్రోగ్రామ్స్‌, నైపుణ్యంతో కూడిన ఫ్యాకల్టిdతో విద్యార్థులకు బోధన, పరిశోధన, వృత్తిపరమైన పాత్రలను అందించడం ద్వారా.. కేఎల్‌హెచ్‌ జీబీఎస్‌ దేశంలో వ్యాపార విద్యను పున:రూపకల్పన చేయడానికి సిద్ధంగా ఉందన్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలు..

కేఎల్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ (కేఎల్‌ఈఎఫ్‌) కార్యదర్శి కాంచన లత మాట్లాడుతూ.. కేఎల్‌హెచ్‌ గ్లోబల్‌ బిజినెస్‌ స్కూల్‌లో కరిక్యులమ్‌, బోధన, అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలు కలిగి ఉంటుందన్నారు. ఛాయిస్‌ గ్రౌండెడ్‌ స్పెషలైజేషన్‌, సెమిస్టర్‌ విదేశీ సెషన్‌లు, ఇంటిగ్రేటెడ్‌ ఇంటర్నేషనల్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌లు వంటి అత్యున్నత ప్రమాణాలతో ఇది తీర్చిదిద్దబడిందని వివరించారు. పరిశ్రమలో జరుగుతున్న మార్పులు, అవసరాలకు అనుగుణంగా ఈ కరిక్యులమ్‌ను క్రమం తప్పకుండా సవరిస్తుంటారన్నారు. శారీరక, మానసిక సంక్షేమాన్ని సమతుల్యం చేసేలా ఈ బీ-స్కూల్‌ పలు రిక్రియేషనల్‌ యాక్టివిటీస్‌ అందిస్తుందన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement